వరంగల్ లో అండర్ 19 క్రికెట్ పోటీలు.. వరంగల్, కరీంనగర్ జట్ల విజయం

వరంగల్ లో అండర్ 19 క్రికెట్ పోటీలు.. వరంగల్, కరీంనగర్ జట్ల విజయం

ధర్మసాగర్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా అండర్–19 క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం వరంగల్ జట్టు ఆదిలాబాద్ జట్టుపై, కరీంనగర జట్టు నిజామాబాద్ జట్టుపై గెలిచాయి. వంగాలపల్లిలో గల వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మైదానంలో వరంగల్, ఆదిలాబాద్ జట్లు తలపడగా.. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు 46.3 ఓవర్లలో 218 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రామ్ చరణ్ 33, రాణాచరణ్ 28 పరుగులుతో రాణించారు.

ఆదిలాబాద్ జట్టులో నితిన్ 3 వికెట్ల తీశాడు. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆదిలాబాద్ జట్టు 39.3 ఓవర్లు ఎదుర్కొని 158 పరుగులకే ఆలౌట్​అయింది. వరంగల్ జట్టులో లెగ్ స్పిన్నర్ పూజిత్ 3 వికెట్లు తీశాడు.

మొగిలిచర్ల మైదానంలో జరిగిన మరో మ్యాచ్​లో నిజామాబాద్, కరీంనగర జట్టు తలపడగా.. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 50 ఓవర్లకు గాను 29 ఓవర్లలో 91 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. కరీంనగర్ జట్టు ఒక్క వికెట్ కోల్పోయి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు తీసిన తక్షిల్ 56 పరుగులు చేసి, ఒంటి చేత్తో కరీంనగర్ జట్టును గెలిపించాడు.